
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న మంత్రి శ్రీనివాసరెడ్డి, ప్రసాదరెడ్డి
కూసుమంచి: క్రీడల్లో జయాపజయాలు సహజమేనని.. పరాజయం ఎదురైనప్పుడు కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగితే విజయం సొంతమవుతుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా పొంగులేటి యువసేన ఆధ్వర్యాన నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు మంగళవారం ముగిశాయి. చివరి మ్యాచ్‌ను మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ముందుకు సాగితే అన్ని రంగాల్లో గెలుపు సాధ్యమవుతుందని తెలిపారు. ఆతర్వాత కాసేపు తన సోదరుడు ప్రసాదరెడ్డితో కలిసి మంత్రి మ్యాచ్‌ను వీక్షించి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. పోటీల నిర్వాహకులు ముద్రబోయిన సత్యనారాయణ, అయితగాని నాగేశ్వరరావు, మొక్కా ఉపేందర్, మద్దెల ఉపేందర్, కొండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి