జమలాపురం ఆలయంలో పుష్పయాగం | Sakshi
Sakshi News home page

జమలాపురం ఆలయంలో పుష్పయాగం

Published Wed, Apr 17 2024 12:35 AM

పుష్పయాగం నిర్వహిస్తుస్తున్న అర్చకులు - Sakshi

ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఎనిమిదో రోజుకు చేరా యి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు అర్చకులు 11 రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. అలాగే, నిత్యకల్యాణం, గరుఢ వాహనంపై గిరిప్రదక్షణ చేయించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ కె.జగన్మోన్‌రావు, చైర్మన్‌ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల విజయదేవశర్మ, మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, సూపరింటెండెంట్‌ విజయకుమారి పాల్గొన్నారు.

భద్రగిరి భక్తులకు

లక్ష మజ్జిగ ప్యాకెట్లు

ఖమ్మంవ్యవసాయం: భద్రాచలంలో బుధవా రం జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవ వేడుకలకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. ఎండ తీవ్రంగా ఉన్న నేపథ్యాన అధికారుల సూచనతో 200 మి.లీ మజ్జిగ ప్యాకెట్‌ రూ.10 చొప్పున ఖమ్మం విజయ డెయిరీ ద్వారా లక్ష ప్యాకెట్లు సరఫరా చేశారు. కానీ ఖమ్మం యూనిట్‌లో నిర్దేశించిన మేరకు మజ్జిగ లభ్యత లేకపోవడంతో హైదరాబాద్‌ నుంచి 70 వేల ప్యాకెట్లు, వరంగల్‌ నుంచి 15 వేల ప్యాకెట్లు సమకూర్చుకున్నారు. వీటికి తోడు ఖమ్మం యూనిట్‌ నుంచి 15 వేల ప్యాకెట్లను మంగళవారం భద్రాచలం పంపించామని డెయిరీ డీడీ ధన్‌రాజ్‌ తెలిపారు.

21న జిల్లాస్థాయి

అథ్లెటిక్స్‌ ఎంపికలు

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లాస్థాయి అండర్‌–14, 16, 18, 20 బాలబాలికలు, మహిళలు, పురుషుల అథ్లెటిక్స్‌ జట్ల ఎంపిక పోటీలు ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈనెల 21న నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్‌ అహ్మద్‌ తెలిపారు. 100, 600, 400, 800, 1,500, 2వేలు, 3వేలు, 5వేల మీట ర్ల పరుగు పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరి చిన వారిని సూర్యాపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు ధృవీకరణ, ఆధార్‌ కార్డుతో ఉదయం 8 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు.

హెచ్‌సీఏ ఆధ్వర్యాన ఉచిత క్రికెట్‌ శిక్షణ

ఖమ్మం స్పోర్ట్స్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) సౌజన్యంతో ఖమ్మంలోని పటేల్‌ స్టేడియం, కొత్తగూడెంలోని గౌతంపూర్‌ మైదానంలో ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. భద్రాద్రి జిల్లా బాలబాలికలు www.hydcricket Asssociation (HCA) వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఖమ్మం జిల్లాకు సంబంధించి వివరాల కోసం నెట్స్‌ మేనేజర్‌ ఎం.డీ.ఫారూఖ్‌ను సంప్రదించాలని జిల్లా కార్యదర్శి, కోఆర్డినేటర్‌ చేకూరి వెంకట్‌, ఎం.డీ.మసూద్‌పాషా తెలి పారు. వివరాల కోసం 98486 62125 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

జిల్లాకు ఇంకో ట్రెయినీ ఐఏఎస్‌

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలో ట్రెయినీ(అసిస్టెంట్‌) కలెక్టర్‌గా బీహార్‌ రాష్ట్రానికి చెందిన మ్రినాల్‌ శ్రేష్ఠ నియమితులయ్యారు. 2023 బ్యాచ్‌కు చెందిన ఆయనను ఏడాది పాటు శిక్షణ నిమిత్తం జిల్లాకు కేటాయించారు. కాగా, ఇప్పటికే మయాంక్‌సింగ్‌, యువరాజ్‌ అసిస్టెంట్‌ కలెక్టర్లుగా ఇక్కడ ఉన్నారు. వీరిలో మయాంక్‌ కాలపరిమితి ముగియనుండడంతో మ్రినాల్‌ను కేటాయించినట్లు తెలిసింది.

25నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు

ఖమ్మం సహకారనగర్‌: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఆర్వో రాజేశ్వరి తెలిపారు. ఈసందర్బంగా ఆమె మంగళవారం విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులు 955మందికి ఐదు, ఇంటర్‌ విద్యార్థులు 1,108మంది కోసం ఐదు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అలాగే, ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మే 5 నుంచి నిర్వహించేందు కు ఏర్పాట్లుచేయాలని సూచించారు. డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ పాపారావు, ఏఓ అరుణ పాల్గొన్నారు.

మ్రినాల్‌ శ్రేష్ఠ
1/1

మ్రినాల్‌ శ్రేష్ఠ

Advertisement
 
Advertisement