సమన్వయంతో పనిచేసి వైరా ఎమ్మెల్యేగా మదన్‌లాల్‌ను గెలిపించుకుందామని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
8లో
జ్వరాల నియంత్రణకు
ముందస్తు చర్యలు
జ్వరాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. అందువల్లే ఈ సీజన్‌లో జ్వరాలు అదుపులో ఉన్నాయి. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అక్కడక్కడా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. వాటి నియంత్రణకు పూర్తిస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేశాం. జ్వరాలు వెలుగు చూసే ప్రాంతంలో రక్త నమూనాలు సేకరిస్తున్నాం. ఇతర శాఖల సమన్వయంతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఫాగింగ్ చేపడుతున్నాం. మురికి గుంతల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ జ్వరాలను అదుపు చేయటానికి చర్యలు తీసుకుంటున్నాం.
–డాక్టర్ బి.మాలతి, డీఎంహెచ్‌ఓ