
సీసీ టీవీల పుటేజీని పరిశీలిస్తున్న కలెక్టర్, సీపీ
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. భారీ క్రేన్లు, స్పీడ్ బోట్లను ఏర్పాటుచేయడమే కాక గజ ఈతగాళ్లను నియమించారు. ఇంకా కేఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ, పోలీసు ఉద్యోగులు ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా షీ టీమ్స్ బృందాలను నియమించడమే కాక డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిమజ్జనాన్ని సీపీ విష్ణు ఎస్. వారియర్ పర్యవేక్షించారు. అలాగే, కలెక్టర్ వీ.పీ.గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్‌తో కలిసి సీపీ మున్నేరు వద్ద పరిశీలించారు. శోభా యాత్ర మార్గంలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి పరిశీలించారు.