
లకారం ట్యాంక్ బండ్‌పై వేడుకల్లో నృత్యం చేస్తున్న దృశ్యం
ఖమ్మం స్పోర్ట్స్: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యాన పెనుబల్లి మండలం పులిగుండాల అటవీ ప్రాంతంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు బుధవారం ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆతర్వాత అటవీ శాఖ అధికారులు పులిగుండాల ప్రాముఖ్యతను వివరించగా.. అక్కడి వ్యర్థాలను విద్యార్థులు తొలగించారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్‌చక్రవర్తి, తల్లాడ రేంజ్ ఆఫీసర్ అరవింద్, డీఆర్‌ఓ రామారావు, అధ్యాపకులు కృష్ణవేణి, ఎఫ్‌ఎస్‌ఓ కాలు, బీట్ ఆఫీసర్లు లావణ్య, సరిత పాల్గొన్నారు.
ఉత్సాహంగా పర్యాటక దినోత్సవం
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై వేడు కలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి బి.సుమన్‌చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

పులిగుండాల వద్ద ఉద్యోగులతో విద్యార్థులు