
బాపూజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి పువ్వాడ, ఎంపీ రవిచంద్ర
వాతావరణ ం
జిల్లాలో గురువారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో ఎండ ప్రభావం పెరుగుతుంది.
● మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ● కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా ఎంపీలతో కలిసి నివాళి
ఖమ్మంమయూరిసెంటర్: స్వాతంత్య్ర సమరయోధుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాంతం తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. మాజీ మంత్రి, స్వాతంత్య్ర సమర యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహానికి ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి బుధవారం మంత్రి నివాళుల ర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడిన బాపూజీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే కేసీఅర్ తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో నేతన్నల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించడంతో పాటు బీమా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియనాయక్, రాములునాయక్, మేయర్ పునుకొల్లు నీరజ, పోలీసు కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, సుడా, మార్కెట్ చైర్మన్లు విజయ్‌కుమార్, దోరేపల్లి శ్వేత, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి.జ్యోతి, పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమర్తపు మురళితో పాటు బొమ్మ రాజేశ్వరరావు, పగడాల నాగరాజు, చిలక మర్రి శ్రీనివాస్‌బాబు, బెండెం జనార్దన్, బండారు శ్రీనివాస్, సత్యనారాయణ, పిల్లలమర్రి కొండలరావు, సంపత్, శివరామకృష్ణ, సుగుణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.