
బహుమతులతో విద్యార్థులు
ములకలపల్లి: అంకంపాలెంలో కొనసాగుతున్న ములకలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ (ఈఎంఆర్‌ఎస్) విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటారు. ఇటీవల సిర్పూర్ కాగజ్‌నగర్‌లో జరిగిన నాలుగో రాష్ట్రస్థాయి 4వ కల్చరల్ ఫెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థులు వివిధ విభాగాల్లో బహుమతులు గెలుచుకున్నారు. పాఠశాల నుంచి 66 మంది విద్యార్థులు పాల్గొనగా ఎనిమిది విభాగాల్లో బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా ఆర్‌సీఓ డేవిడ్‌రాజ్, ప్రిన్సిపాల్ రాజేశ్, వైస్ ప్రిన్సిపాల్ బానోతు లక్ష్మి, ఉపాధ్యాయులు ఎం.చైతన్య, ఎం.శ్రీనివాస్ తదితరులు శనివారం అభినందించారు.