● స్నేహితుల వేధింపులే కారణం?
వైరా: వైరాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కడారి దీప్తి శుక్రవారం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థినుల వేధింపులు తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వైరా బీసీ కాలనీకి చెందిన ఆమెను మెరుగైన వైద్యం కోసం పాఠశాల ఉద్యోగులు ఖమ్మం తరలించినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలుకానున్న నేపథ్యాన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పాఠశాలలో ఆందోళన నెలకొందిది.
వ్యక్తి మృతిపై
పోలీసులకు ఫిర్యాదు
తిరుమలాయపాలెం: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఆయన భార్య ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని తిప్పారెడ్డిగూడెంకు చెందిన రావుట్ల రాజేశ్వరాచారి(45) పది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికాగా, చికిత్స చేయించాక ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ అనారోగ్యానికి గురైన ఆయన 29వ తేదీన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. అయితే, కారణాలేమిటో తెలియరాకున్నా ఆస్పతి ఆర్‌ఎంఓ అనుమానం వ్యక్తం చేయడంతో మృతుడి భార్య సుగుణ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.