పల్లెల అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం,జిల్లా ముందంజలో నిలుస్తున్నాయని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
8లో
జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో ముదిగొండ మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతివేగంతో వెళ్లకపోతే వీరు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడే వారు. వైరాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు కన్నుమూశారు. వీరిలో ద్విచక్ర వాహనం నడుపుతున్న భర్తకు హెల్మెట్ ఉన్నా ధరించలేదు. ఒకవేళ హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఒకరైనా బతికి ఉండే వారనే చర్చ జరుగుతోంది. ఇలా జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.