
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో చాన్నాళ్ల తర్వాత శనివారం కరోనా కేసు నమోదైంది. మొద టి, రెండు, మూడో వేవ్‌లు ముగి శాక మళ్లీ ఇప్పుడు కరోనా కేసు నమోదు కావడం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి పరీక్షలు చేయగా కరోనాగా నిర్ధారణ అయింది. దీంతో స్పందించిన జిల్లా అధికారులు సమీక్షించారు. ఆస్పత్రుల్లో పరీక్షలకు ఉన్న సౌకర్యాలు, అనుమానితులు వస్తున్నారా, పరీక్షలు ఎలా జరుగుతున్నాయనే అంశంపై సమాచారం సేకరించారు.
నలుగురు డీబార్
ఖమ్మం సహకారనగర్/నేలకొండపల్లి: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో శనివారం మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను డీబార్ చేశారు. నేలకొండపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కేంద్రంలో ఇంటర్ పరీక్షలను స్క్వాడ్ బృందాలు తనిఖీ చేయగా, వృత్తి విద్యా కోర్సుల పరీక్ష రాస్తున్న ఇద్దరు, ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్ష రాస్తున్న ఒక్కో విద్యార్థి కాపీ చేస్తున్నట్లు గుర్తించి డీబార్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, శనివారం పరీక్షలకు 18,849మంది విద్యార్థుల్లో 17,907మంది హాజరు కాగా 942మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు.