
రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గం
ఖమ్మం మామిళ్లగూడెం: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్‌గా డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ ఎన్నికయ్యారు. తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, శనివారం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈమేరకు చైర్మన్‌గా చంద్రమోహన్‌తో పాటు వైస్ చైర్మన్‌గా ఆర్.రవీందర్‌రావు, కోశాధికారి గా ఎ.గోవర్దన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసమావేశంలో సభ్యులు సాదినేని జనార్దన్‌రావు, డాక్టర్ విజయలక్ష్మి, కొత్తా సత్యనారాయణరెడ్డి, గజేంద్రుల నాగేశ్వరావు, తాతా రాఘవయ్య, జెల్లా వెంకటేశ్వర్లు, సూర్యప్రకాశరావు, ఎస్.కే.ముజీబ్, డాక్టర్ బిబాలు, గుడ్ల వీరభద్రరావు, జెల్లా లక్ష్మీనారాయణ, మూలగుండ్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.