
మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
ఖమ్మం సహకారనగర్/కూసుమంచి: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల చేపట్టిన యాత్రతో ఆదరణ పెరుగుతుండడంతో ఓర్వలేక ఆయనపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ జావీద్ ఆరోపించారు. ఈమేరకు శనివారం కాంగ్రెస్ నాయకులు నగరంలో నిరసన తెలిపి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్‌గాంధీపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను దేశ ప్రజలను గమనిస్తున్నారన్నారు. ఎన్ని అక్రమకేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈకార్యక్రమంలో నాయకులు మద్ది వీరారెడ్డి, బొందయ్య, రవికుమార్, వెంకటేశ్వర్లు, భారతిచంద్రం, సయ్యద్ గౌస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే, కూసుమంచిలో కూడా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యాన ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.