కమ్యూనిస్టులు ఉన్న వైపే విజయాలు | - | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టులు ఉన్న వైపే విజయాలు

Mar 26 2023 2:04 AM | Updated on Mar 26 2023 2:04 AM

మాట్లాడుతున్న ఎంపీ నాగేశ్వరరావు, పక్కన తమ్మినేని వీరభద్రం - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ నాగేశ్వరరావు, పక్కన తమ్మినేని వీరభద్రం

●సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ● సంఘీభావం తెలిపిన ఎంపీ నామా నాగేశ్వరరావు

నేలకొండపల్లి: కమ్యూనిస్టులు ఏ పక్షాన ఉంటే వారే గెలుస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన జన చైతన్య యాత్ర శనివారం నేలకొండపల్లికి చేరగా సభలో ఆయన మాట్లాడారు. ము నుగోడు విజయం కమ్యూనిస్టులదేనని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కూడా అంటున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పాలేరుతో పాటు అనేక నియోజకవర్గాలను ప్రాధాన్యతగా పెట్టుకున్నామని తెలిపారు. కాగా, సమర్ధించే వాళ్ల ను సహించే పరిస్థితి ప్రధాని మోడీకి లేదని ఆరోపించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే దేశం విచ్ఛి న్నం అవుతుందని, లౌకికతత్వం కనుమరుగవుతుందని ఆయన తెలిపారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీపై భయంతోనే బీజేపీ నేతలు సస్పెన్షన్‌ విధించారని ఆరోపించారు. రాష్ట్రంలో పేపర్ల లీకేజీ విషయంలో దోషులను గుర్తించాలని కోరుతున్నట్లు తమ్మినేని తెలిపారు.

బీజేపీని తరిమికొట్టాలి : ఎంపీ నామా

ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని తరిమికొట్టాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. యాత్రకు సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ బీజేపీని గద్దె దింపకపోతే దేశానికి పెనుముప్పు ఎదురవుతుందని తెలిపారు. రైతు బంధు జిల్లా కన్వీనర్‌ వెంకటేశ్వరావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనలక్ష్మి, ఎంపీపీ రమ్య తదితరులు కూడా సంఘీబావం తెలిపారు. సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, రామారావు, జి.నాగేశ్వరరావు, సిరికొండ ఉమామహేశ్వరి, బి.లక్ష్మి, యలమద్ది లెనిన్‌, యడ్ల తిరపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement