
సదస్సులో పాల్గొన్న ప్రజాతంత్రవాదులు
ఖమ్మంగాంధీచౌక్: ప్రస్తుత సమాజంలో రాజకీ య నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నేపథ్యాన పరిరక్షణ కోసం ప్రజలే నడుం బిగించాలని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సూ చించారు. ఖమ్మంలో ‘వెంటిలేటర్‌పై ప్రజాస్వామ్యం’ అంశంపై ఏర్పాటుచేసిన ప్రజాతంత్ర వాదుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజా స్వామ్యానికి మూలస్తంభాలైన వ్యవస్థలు పాలకుల జేబు సంస్థల్లా మారాయని విమర్శించారు. ఈమేరకు పాలకులకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అంశంపై ప్రజలను చైతన్యపర్చాల్సిన బాధ్యత ప్రజాతంత్రవాదులపై ఉందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ములక సురేష్ అధ్యక్షత వహించగా సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ కరణాకర్ దేశాయ్, ఆనంచిన్ని వెంకటేశ్వర్లు, డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ కే.వీ.కృష్ణారావు, గుంతేటి వీరభద్రం, సుంకరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సస్యరక్షణ చర్యలతో అగ్గి తెగులు నివారణ
ఏన్కూరు: వరి పంటను ఆశిస్తున్న అగ్గి తెగులు నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల సూచించారు. మండలంలోని మూలపోచారం, రాంగనగర్ తండా, తిమ్మారావుపేట గ్రామాల్లో వరి పంటను శనివారం ఆమె పరిశీ లించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ అగ్గి తెగులు నివారణకు ట్రైక్లోజోల్ 0.6 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని, నత్రజని ఎరువు తగిన మోతాదులోనే వాడాలని తెలిపారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉన్నందున నీటి ఎద్దడికి గురి కాకుండా చూడాలని చె ప్పారు. ఏడీఏ వి.బాబురావు, ఏఓ నర్సింహారా వు, ఏఈఓలు బాలకృష్ణ, రవి పాల్గొన్నారు.
ఎస్‌బీ సీఐగా సర్వయ్య
ఖమ్మంక్రైం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ సీఐగా సర్వయ్యను నియమిస్తూ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఖమ్మం త్రీటౌన్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సర్వయ్యను ఇటీవల ఐజీకి అటాచ్ చేసిన విషయం విదితమే. తాజాగా ఆయనకు పోస్టింగ్ కల్పించారు.
బీఎస్‌ఎన్‌ఎల్‌కు మద్దతుగా నిలవాలి
ఖమ్మంమయూరిసెంటర్: బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు పొందుతున్న వినియోగదారులు సంస్థకు మద్దతుగా నిలవాలని జనరల్ మేనేజర్ పి.వెంకటే శం ఒక ప్రకటనలో కోరారు. మార్చి బిల్లులు ఇ ప్పటికే పోస్టాఫీస్‌కు పంపించామని, ఎవరికై నా బిల్లులు రాకపోతే కస్టమర్ సర్వీస్ సెంటర్ల నుంచి మరో కాపీ తీసుకోవచ్చని తెలిపారు. కాగా, ఈనెల 26, 30వ తేదీల్లో కూడా కస్టమర్ సేవా కేంద్రాలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.
సామగ్రి, నగదు చోరీ
సత్తుపల్లిటౌన్: స్థానిక కొత్తకొమ్మేపల్లి కాలనీలోని బడ్డీ కొట్టులో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కాలనీకి చెందిన చేపలమడుగు నాగరత్నం శుక్రవారం రాత్రి బడ్డీకొట్టుకు తాళం వేసి ఇంటికి వెళ్లింది. శనివారం ఉదయం వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. దీంతో పరిశీలించగా రూ.15వేల విలువైన సామాగ్రి, రూ.5వేల నగదు చోరీ జరిగినట్లు గుర్తించి సమాచారం ఇవ్వగా పోలీసులు పరిశీలించారు.
వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురిపై కేసు
తల్లాడ: మండలంలోని నారాయణపురంలో వరకట్నం వేధింపులు భరించలేక పొట్టేటి శ్రావ్య ఆత్మహత్య చేసుకోగా, కారకులైన నలుగురిపై తల్లాడ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.... శ్రావ్యకు మూడేళ్ల క్రితం వి.పవన్ కృష్ణారెడ్డితో వివాహమైంది. వివాహమైన దగ్గర నుంచి వరకట్నం కోసం ఆయన వేధిస్తున్నాడు. దీంతో వేధింపులు భరించలేక ఆమె శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకోగా.. భర్త పవన్ కృష్ణారెడ్డి, మామ శివనాగిరెడ్డి, అత్త కుమారి, ఆడబిడ్డ ఆళ్ల లక్ష్మీప్రసన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డుప్రమాదంలో ఖమ్మం వాసి మృతి
ఖమ్మంక్రైం: సూర్యాపేటలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన యువకుడు మృతి చెందాడు. నగరంలోని మోతీనగర్‌కు చెందిన గౌరిశెట్టి వినయ్(21) శుక్రవారం రాత్రి ఖమ్మం నుండి హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. రాత్రి 11గంటల సమయాన సూర్యాపేట సమీపంలో చెవ్వెంల పోలీస్‌స్టేషన్ వద్ద రాగానే రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చిన ద్వి చక్రవాహనం ఢీకొట్టింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన వినయ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

రైతులకు సూచనలు ఇస్తున్న డీఏఓ విజయనిర్మల