
కబడ్డీ ఆడుతున్న బాలికలు (ఫైల్)
ఉగాది పురస్కారాలు స్వీకరించిన విద్వాంసులు
● నిధులు, నియామకాల్లేవు.. ● ఔత్సాహికులకు సీనియర్ క్రీడాకారులే కోచ్‌లు ● క్రీడా సంఘాలు నిర్వహించే టోర్నీలకు సైతం నిధుల కొరత ● కోచ్‌లు లేక గ్రామాల్లో నిరుపయోగంగా క్రీడాప్రాంగణాలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో వాయిద్య విద్వాంసులుగా పనిచేస్తున్న ఎం. నాగేశ్వరరావు, ఎల్.కేశవ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలను స్వీకరించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన ఉగాది వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీరికి పురస్కారాలు అందజేసి సన్మానించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కే.వీ.రమణాచారి తదితరులు పాల్గొన్నారు. కాగా, దేవస్థానంలో నాగేశ్వరరావు డోలు, కేశవ్ సన్నాయి వాయిద్య విద్వాంసులుగా పని చేస్తున్నారు.
అర్చకుడు మధుసూదనాచార్యులు..
నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ అర్చకుడు తుపురాణి మధుసూదనాచార్యులు రాష్ట్రప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో స్వీకరించారు. ఆయనను సర్పంచ్ రాయపూడి నవీన్‌తో పాటు బొందయ్య, వెంకటలక్ష్మి, దోసపాటి శేఖర్, రేగూరి హనుమంతరావు, దోసపాటి శేఖర్ తదితరులు అభినందించారు.

మంత్రి ఐకే.రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న నాగేశ్వరరావు

మధుసూదనాచార్యులు

కేశవ్