రాజధానిలో స్మార్ట్‌ పార్కింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రాజధానిలో స్మార్ట్‌ పార్కింగ్‌

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

బనశంకరి: బెంగళూరు దక్షిణ నగర పాలికే పరిధిలో ప్రయోగాత్మకంగా ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే జయనగరలో ఏఐ సెన్సార్ల ఆధారిత పార్కింగ్‌ వ్యవస్థను అమలు చేస్తామని, ఇందుకు ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని కమిషనర్‌ కేఎన్‌.రమేశ్‌ తెలిపారు. గురువారం ఈ వ్యవస్థ అమలుపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. క్రాస్‌మార్కింగ్‌ లేదా అడ్డదిడ్డంగా పార్కింగ్‌ను అడ్డుకుంటే ఎక్కువ వాహనాలను పార్కింగ్‌ చేయవచ్చు అన్నారు. పార్కింగ్‌ నుంచి వాహనాలను బయటకు తీసినప్పుడు ఇతర వాహనాలకు ఇబ్బంది ఏర్పడదని తెలిపారు. రహదారి స్థలాల గరిష్ట వినియోగం కావాలన్నారు.

ఆన్‌లైన్‌లో పార్కింగ్‌ రుసుము

ఖాళీగా ఉండే స్థలాలను పార్కింగ్‌ ప్రదేశాలుగా రూపొందిస్తారు. అక్కడ అమర్చిన క్యూఆర్‌ కోడ్‌ను వాహనదారులు స్కాన్‌చేసి రుసుము చెల్లించవచ్చు. జయనగరలో కొన్ని ప్రముఖ రోడ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసి చూస్తారు. ఫలితాలను బట్టి పూర్తిస్థాయిలో స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తామని కమిషనర్‌ కేఎన్‌.రమేశ్‌ తెలిపారు.

ఏఐ స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థ నమూనా

తొలుత జయనగరలో

ప్రయోగాత్మకంగా అమలు

సర్‌పై 1950 హెల్ప్‌లైన్‌

జాబితాల నుంచి అర్హులైన ఓటర్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని బెంగళూరు జిల్లా ఎన్నికల అధికారి, జీబీఏ కమిషనర్‌ మహేశ్వర్‌రావ్‌ తెలిపారు. సర్‌పై గురువారం వివిధ పార్టీల నేతలతో జీబీఏ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిపారు. సర్‌పై అనుమానాలు ఉంటే ప్రజలు 1950 సహాయవాణిని సంప్రదించవచ్చునని తెలిపారు. ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం అందించాలని అధికారులకు సూచించారు. సిబ్బంది జవాబుదారీగా పనిచేయాలని హెచ్చరించారు. పాలికెల కమిషనర్లు సునీల్‌కుమార్‌, కేఎన్‌.రమేశ్‌, కేవీ.రాజేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement