రాయచూరు రూరల్: కలబుర్గిలోని సర్దార్ వల్లబ్‌బాయి పటేల్ క్రీడా మైదానంలో గురువారం కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంలో భాగంగా జిల్లా పాలన యంత్రాంగం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. బంజారా సముదాయం లంబాడీ నృత్యం చేసి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది. మరో వైపు ఉడుపి నాట్య కళాకారులు తమ యక్షగాన ప్రదర్శనతో అందరినీ అలరించారు. అనంతరం ముఖ్యమంత్రి శివ కుమార్ గాణగాపురలో వెలసిన దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.


