విశ్వకర్మ జయంతి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

రాయచూరు రూరల్‌: నగరంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను తహసీల్దార్‌ సురేష్‌ వర్మ, మాజీ మంత్రి ఎన్‌ఎస్‌ బోసురాజు ప్రారంభించారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా పంచాయతీ, జిల్లాధికార యంత్రాంగం, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ, నగరసభ, కన్నడ సంస్కృతీ శాఖ, అఖిల కర్ణాటక విశ్వకర్మ సమాజం మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవంలో తహసీల్దార్‌ మాట్లాడారు. విశ్వకర్మ సమాజం అన్ని వర్గాల సేవకు ముందుంటుందన్నారు. సమావేశంలో విశ్వకర్మ జిల్లా సంచాలకుడు బ్రహ్మ గణేష్‌, అదనపు జిల్లాధికారి దురుగేష్‌, సమాజం నేతలు గురు, రాము, ప్రకాష్‌, మనోహర్‌, రవి, మారుతి, శరణు, సురేష్‌, వెంకటేష్‌, వీరేష్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement