ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన.! | - | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన.!

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

బళ్లారిటౌన్‌: నగరంలో గురువారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురిసింది. వాతావరణ వైపరీత్యాలతో ఎండాకాలంలో మాదిరిగా భగభగమండుతున్న ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. వర్షం కురవడంతో వాతావరణం కొంత చల్లబడింది. వర్షంతో ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంలోని రాయల్‌ సర్కిల్‌, పటేల్‌నగర్‌, మోతీ సర్కిల్‌, గాంధీనగర్‌, నెహ్రు కాలనీ, పార్వతీ నగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లలో నీరు పారి ప్రజలను ఉత్సాహపరిచింది.

హమ్మయ్య.. వర్షం కురిసింది

ఎట్టకేలకు బళ్లారి నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. గురువారం సాయంత్రం పలుప్రాంతాలలో కురిసిన వాన. వేడిమి తగ్గి చల్లదనం రావడంతో ప్రజలు హమ్మయ్య అనుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement