బళ్లారి అర్బన్: ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసే విషయంలో అధికారులు చురుగ్గా పని చేయాల్సిన అవసరం ఉందని సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించాలని సీఎం డీకే శివకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా పని చేస్తే సహించేది లేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలు పరిష్కరించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్లు తదితర ఎన్నో సమస్యల్లో జాప్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇకపై నిర్లక్ష్యం, ఆలస్యం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2028 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వస్తుందని, జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందుతారన్నారు. వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనను త్వరలో భారీ స్థాయిలో నిర్వహిస్తామన్నారు.
ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి


