ముఖ్యమంత్రి రాజీనామా బాధాకరం | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి రాజీనామా బాధాకరం

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

బళ్లారి టౌన్‌: అహింద నేత, సీఎం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి హైకమాండ్‌ తప్పించడం తమ సమాజానికి చాలా బాధాకరంగా ఉందని కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు గాదిలింగనగౌడ, ప్రధాన కార్యదర్శి మోహన్‌ పేర్కొన్నారు. గురువారం సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2028లో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందన్నారు. ఆయన అన్ని వర్గాలకు అనుకూలంగా ఉన్నందున ఆయనకు అభిమానులున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావడానికి ఆయన బలమైన నాయకత్వమే కారణమన్నారు. సంఘం నాయకులు భట్టి ఎర్రిస్వామి, గంగాధర్‌, మల్లేశప్ప, హొన్నూరుస్వామి, రఘు, శివమూర్తి, శ్రీకాంత్‌, యశోద తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement