కేజీఎఫ్: నకిలీ విత్తనాలను విక్రయించి రైతులకు పంట నష్టానికి కారణమైన సెమినీస్ కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతు సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ.. కంపెనీ నకిలీ విత్తనాలను అందించడం వల్ల రైతు చంగాలరెడ్డికి చెందిన పంట దెబ్బతిందన్నారు. పంట నష్టపోయిన రైతుకు 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు నకిలీ విత్తనాలను సరఫరా చేసి వంచన చేసిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటకు మంచి ధర ఉండగా.. నకిలీ విత్తనాలతో 75 శాతం పంట నష్టపోయారన్నారు. కార్యక్రమంలో యువ రైతు భాస్కరరెడ్డి, కారివిశ్వనాథ్, బేతమంగల, క్యాసంబళ్లి ప్రకాష్, పుత్తేరి రాజు, గిరీష్, జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.


