యలహంక చెరువులో విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు
బనశంకరి: వర్షాకాలం వస్తుండగా, యలహంకలో పలు ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా వచ్చే ముప్పును ఎదుర్కొనేలా రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలు సోమవారం యలహంక చెరువులో మాక్ డ్రిల్ నిర్వహించారు. త్వరలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రుతుపవనాలు వస్తుండగా, ప్రజల్లో జాగృతం అవసరమన్నారు. రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే ముందే ప్రజలు ప్రాథమిక రక్షణ చర్యలు చేపట్టడం గురించి తెలుసుకోవాలని తెలిపారు. ముంగారు వర్షాల సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, నగరపాలికే అధికారులు, వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఆయా శాఖల ఫోన్ నంబర్లు ప్రజల వద్ద ఉండాలన్నారు. వర్షాకాలంలో రోడ్ల భద్రత, వరద నివారణ తదితర చర్యలపై జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నీటిలో చిక్కుకున్న వారిని రబ్బరు బోట్లలో వెళ్లి కాపాడడం, సురక్షితంగా తరలించడం వంటి విన్యాసాలను ప్రదర్శించారు.
యలహంక చెరువులో అత్యవసర దళాల రిహార్సల్స్


