అంగన్‌వాడీలోనే సోదరి హత్య | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలోనే సోదరి హత్య

May 26 2026 7:42 AM | Updated on May 26 2026 7:42 AM

శిగ్గావిలో తమ్ముని కిరాతకం

హుబ్లీ: సొంత సోదరి ప్రవర్తన బాగా లేదనే అనుమానంతో అంగన్‌వాడీలో ఉండగానే ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేసిన కిరాతక ఘటన హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో జరిగింది. సుమా శివశంకర్‌ వనహళ్లి (29) హతురాలు. శిగ్గావిలోని మౌలాలి గుడ్డలోని అంగన్‌వాడీలో ఆయాగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం 10:15 గంటలకు తమ్ముడు సంజు వచ్చీ రాగానే ఆమెను చితకబాది, కత్తితో చేతులు, గొంతు కోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది, విలవిలలాడుతూ కొంతసేపటికే మరణించింది. అంగన్‌వాడీలోని పిల్లలు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిసింది. హుబ్లీ ప్రాంతానికి చెందిన సుమ భర్తతో గొడవలొచ్చి ఒంటరిగా జీవిస్తోంది. పైగా తమ్మునితో ఆస్తి గొడవలు ఉన్నాయి. దీంతో అతడు హత్యకు పాల్పడినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement