హొసపేటె: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీటిని అందించడం అనే బృహత్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు జిల్లాధికారిణి కవిత పేర్కొన్నారు. సోమవారం నగరంలోని టీపీ కార్యాలయ విద్యారణ్య సభాంగణంలో ఏర్పాటు చేసిన నీటి పరీక్షలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి జూన్ 10 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం చాలా అవసరం అన్నారు.
నీటి వనరులు కలుషితం కావద్దు
వర్షాకాలం ప్రారంభమైనందున నీటి వనరులు కలుషితం కాకుండా నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ తమకు అందించిన కిట్లను సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కఠినంగా ఆదేశించారు. అపరిశుభ్ర, కలుషిత నీటిని తాగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపించే కలరా, కామెర్లు, అతిసారం వంటి వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అత్యవసరం అని అన్నారు. గ్రామ నీటి వనరుల్లో సరైన నిష్పత్తిలో క్లోరినేషన్ ప్రక్రియను చేపట్టాలన్నారు. స్వచ్ఛమైన తాగునీటి ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కూడా సూచించారు.
ప్రత్యేక నీటి పరీక్ష కిట్ల పంపిణీ
తాలూకాలోని పీడీఓలందరికీ గ్రామ నీటి సరఫరా, ముఖ్యంగా ప్రతి రోజూ నీటిని సరఫరా చేసే కొళాయిల వద్ద ప్రత్యేక నీటి పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణ తాగునీటి, పారిశుధ్య శాఖ సీనియర్ రసాయన శాస్త్రవేత్త మొత్తం శిక్షణను ఆచరణాత్మక పద్ధతిలో నిర్వహించారు. కిట్‌ను ఉపయోగించి నీటిలోని ఫ్లోరైడ్, నైట్రేట్, క్లోరైడ్ కాఠిన్య స్థాయిలను అక్కడికక్కడే ఎలా గుర్తించాలో ఆమె ప్రదర్శించారు. టీపీ ఈఓ ఆలం బాషా, ఏఈఓ విజయ్‌కుమార్, జూనియర్ ఇంజనీర్లు సురేష్, నరేష్, సహాయక ఇంజనీర్ మహారుద్ర గౌడ, సీనియర్ కెమిస్ట్ అరుణ్‌కుమార్ హాజరయ్యారు.
అధికారులకు జిల్లాధికారిణి సూచన
జూన్ 10 వరకు జిల్లాలో ప్రత్యేక
ప్రచార కార్యక్రమం


