కేసు విచారణ వాయిదా | - | Sakshi
Sakshi News home page

కేసు విచారణ వాయిదా

May 26 2026 7:42 AM | Updated on May 26 2026 7:42 AM

దర్యాప్తు అధికారి డుమ్మా..

హుబ్లీ: దర్యాప్తు అధికారి అంటుబాటులో లేని కారణంగా హరిహర పంచమసాలి పీఠం వచనానంద స్వామీజీ కేసు విచారణను వాయిదా వేశారు. స్వామీజీ సోమవారం హరిహర రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు హాజరు కావాల్సి ఉంది. వేరే కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి హరిహర రూరల్‌ సీఐ సురేష్‌ తగరి కేంద్ర స్థానం నుంచి బయటకు వెళ్లిన కారణంగా కేసు విచారణ వాయిదా పడింది. విచారణకు సహకరించాలని సీఐ లిఖితపత్రాన్ని స్వామీజీకి పంపారు. ఇంతకు ముందు హరిహర పంచమసాలి పీఠం వచనానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదైంది. హరిహర రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు మూడోసారి విచారణకు వచనానంద స్వామీజీ హాజరు కావాల్సింది. మఠంలోని హాస్టల్‌ విద్యార్థులపై శారీరకంగా హింసకు పాల్పడ్డారని స్వామీజీపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గదగ్‌ జిల్లాలో కేసు నమోదైంది. అక్కడి నుంచి హరిహర రూరల్‌ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.

బెయిల్‌ రద్దు కోసం రిట్‌

సీఐ సురేష్‌ తగరి నేతృత్వంలో దర్యాప్తు అధికారిణి ఎస్‌ఐ జయరత్నమ్మ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అయితే పోక్సో కేసు దాఖలుకు ముందే స్వామీజీ ముందస్తు బెయిలు తీసుకున్నారు. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు జిల్లా కోర్టులో రిట్‌ వేశారు. ఈక్రమంలో వచనానంద స్వామీజీని విచారణకు పిలిచి ఆరోగ్య పరీక్షలు చేయించారు. స్వామీజీ అసభ్యంగా తిట్టేవారని, హింస పెట్టేవారని స్వయంగా పిల్లలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాలల సంక్షేమ కమిటీ అధికారులు మఠానికి వెళ్లి స్వామీజీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. స్వామీజీపై మఠానికి చెందిన బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదైంది. కాగా తూర్పు రేంజ్‌ ఐజీ డాక్టర్‌ బీఆర్‌ రవికాంతేగౌడ సూచన మేరకు స్వామీజీపై పోక్సో కేసు దర్యాప్తు అధికారిణి సీఐ మంజులను ఎస్పీ డాక్టర్‌ హెచ్‌టీ శేఖర్‌ బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement