రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మరణించగా, 10 పశువులు బలి కాగా ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మస్కి తాలూకా పామన కల్లూరు ఫిర్కా పర్వతాపురలో నింగప్ప(38) పిడుగుపాటుతో మరణించారు. పొలంలో పని చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మస్కి శాసన సభ్యుడు బసనగౌడ తుర్విహాళ, ఎస్‌ఐ ఘటన స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మి(28), రామయ్య(30) గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింధనూరు తాలూకా సుల్తాన్‌పురలో హనుమంతు అనే రైతుకు చెందిన 250 బస్తాలు, తిప్పణ్ణకు చెందిన 250 బస్తాలు, నాగేష్‌కు చెందిన 150 బస్తాలు, లక్ష్మణ్ అనే రైతుకు చెందిన 250 బస్తాల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దాదాపు రూ.10 లక్షల మేర నష్టం సంభవించినట్లు రైతులు వాపోయారు. శాసన సభ్యుడు బసనగౌడ తుర్విహాళ మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 లక్షల పరిహారధనం చెక్‌ను అందించారు.
ఇద్దరికి గాయాలు
తడిసిన వరిధాన్యం


