కోట జాతరకు భక్తకోటి | - | Sakshi
Sakshi News home page

కోట జాతరకు భక్తకోటి

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

బొమ్మనహళ్లి: కాఫీనాడు చిక్కమగళూరు నగరం కోట లో శ్రీగాలికెరేయ కెంచరాయ స్వామి జాతర వైభవంగా జరుగుతోంది. దేవదేవుల ఊరేగింపు, రంగు రంగుల దీపాలంకరణలు, వాయిద్యాల నాదం, భక్తుల కేరింతలతో కోలాహలం నెలకొంది. ఈ జాతర ప్రత్యేకత ఏమిటంటే, మల్నాడులోని ముగ్గురు కొండ దేవతల ఆశీస్సులు పొందిన తర్వాతే ఇది ప్రారంభమవుతుంది. కర్ణాటకలోని అత్యంత ఎత్తైన శిఖరమైన ముల్లయనగిరి పైన కొలువై ఉన్న శ్రీ ముల్లప్ప స్వామి సింహాసనం నుండి ఆశీస్సులు పొందిన తర్వాతే కెంచరాయ స్వామి జాతర ప్రారంభమవుతుందని భక్తులు నమ్ముతారు. కెంచరాయస్వామి విగ్రహాలను అలంకరించి ప్రతిష్టించగా భక్తసాగరం దర్శించుకుంది. 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

చిక్కమగళూరులో భక్తి ఉత్సవం

Advertisement
 
Advertisement
Advertisement