ఆయిల్‌ ట్యాంకర్‌లో గుట్టుగా స్పిరిట్‌ రవాణా | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ట్యాంకర్‌లో గుట్టుగా స్పిరిట్‌ రవాణా

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

హుబ్లీ: ఆయిల్‌ ట్యాంకర్‌లో అక్రమంగా స్పిరిట్‌ రవాణా చేస్తున్న ముఠాను బెళగావి జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. కాణాపుర తాలూకా జాంబోటి గ్రామ సమీపంలో ఎకై ్సజ్‌ అధికారుల బృందం దాడి చేసి ఓ నిందితుడిని అరెస్ట్‌ చేసింది. అలాగే రూ.14 లక్షల విలువ చేసే 14 వేల లీటర్ల స్పిరిట్‌, రూ.21 లక్షల విలువ చేసే ట్యాంకర్‌, రూ.1,500 విలువైన మొబైల్‌ను జప్తు చేశారు. మైసూర్‌ జిల్లా నంజనగూడ తాలూకా ఎగ్గినబాలు గ్రామానికి చెందిన ట్యాంకర్‌ డ్రైవర్‌ సిద్దరాజును అరెస్ట్‌ చేశారు. ఈ గ్యాంగ్‌ ఎకై ్సజ్‌ అధికారులకు అనుమానం రాకుండా కొత్త తంత్రాన్ని ప్రయోగించింది. ట్యాంకర్‌ మూడు భాగాల్లో చిన్న చిన్న పైపులు అమర్చి అందులో మాత్రమే ఆయిల్‌ లోడ్‌ చేశారు. అధికారులు తనిఖీ చేసే సమయంలో కేవలం ఆ పైపుల్లో ఉన్న ఆయిల్‌ను చూపించి అక్కడి నుంచి ఉడాయిస్తారు. విశ్వాసనీయ సమాచారం మేరకు దాడి చేసిన ఖాణాపుర ఎకై ్సజ్‌ అధికారులు తనిఖీ వేళ అనుమానం వచ్చింది. తక్షణమే ట్యాంకర్‌లో ఉన్న ఆయిల్‌ పైపులను బయటకు తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. లోపల వేలాది లీటర్ల స్పిరిట్‌ లోడ్‌ కనిపించింది. సామాన్యంగా గోవా నుంచి కర్ణాటక తదితర రాష్ట్రాలకు అక్రమంగా మద్యం రవాణా కేసులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఘారానా ముఠా బెంగళూరు రూరల్‌ జిల్లా నెలమంగల నుంచి గోవాకు ఈ స్పిరిట్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ దందాలో ఎవరెవరు ఉన్నారు? ఇందులో సూత్రధారి ఎవరు అనే దానిపై దర్యాప్తు చేపట్టాం.. త్వరలోనే కీలక నిందితులను అరెస్ట్‌ చేస్తామని ఎకై ్సజ్‌ అడిషనల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వై.మంజునాథ వెల్లడించారు. దాడిలో అధికారులు జగదీశ్‌, విజయ్‌కుమార్‌ హిరేమఠ, నేతృత్వంలో రవి ముడగోడ, నూరుల్లాఖాన్‌, సునిల్‌ పాటిల్‌, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement