ఎస్టీలకు రిజర్వేషన్‌ పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్టీలకు రిజర్వేషన్‌ పెంచాలి

May 24 2026 12:45 AM | Updated on May 24 2026 12:45 AM

హొసపేటె: జనాభా ప్రకారం ఎస్టీలకు మరింతగా రిజర్వేషన్‌ కల్పించాలని మాజీ ఎంపీ వీఎస్‌.ఉగ్రప్ప డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని వాల్మీకి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దోపిడీకి గురైన ఎస్సీ, ఎస్టీ ప్రజల తరపున తాను రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించానన్నారు. అందులో భాగంగా మొదట విలేకరుల సమావేశాలు, చర్చలు నిర్వహించి జిల్లా మేజిస్రేట్ల ద్వారా వినతిపత్రాలు సమర్పించామన్నారు. 2011 లెక్కల ప్రకారం జనాభాలో 17.10 శాతం ఎస్సీలు, 7 శాతం ఎస్టీలు, 32 శాతం ఓబీసీలు ఉన్నారన్నారు. ఈ మూడు వర్గాలకు చెందిన వారు 4 కోట్ల మందికి పైగా ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు వేర్వేరు జీవన విధానాల్లో జీవిస్తున్నారన్నారు. 101 ఎస్సీ కులాలు, 51 ఎస్టీ కులాలు ఉండగా, నకిలీ కుల ధృవీకరణ పత్రాలే లక్షకు పైగా ఉన్నాయని, తళ్వార్‌, పరివార్‌లను కూడా కలుపుకుంటే ఎస్టీల వాటా 7 శాతంగా మారిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement