బళ్లారిఅర్బన్: నగరంలోని 3వ వార్డు ఏపీఎంసీ సర్కిల్ నుంచి బెంకి మారెమ్మ ఆలయం మీదుగా డీఎస్పీ కార్యాలయం వరకు కలిపే ప్రధాన రహదారి అభివృద్ధి పనులను శుక్రవారం ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు రూ.4.50 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్పొరేటర్ ఎం.ప్రభంజన్‌కుమార్, నాయకులు సుబ్బరాయుడు, వాసురెడ్డి, భరత్, కవిత, కుమారన్‌తో పాటు పలువురు స్థానికులు హాజరయ్యారు.


