● ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మన హళ్లిలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. మృతురాలిని ప్రియాంక (27)గా గుర్తించారు. ప్రియాంక స్థానికంగా ఉన్న మియా ఫ్యాషన్ బట్టల దుకాణంలో పని చేస్తోంది. ఆమెకు గతంలో వివాహం జరిగి, అనంతరం విడాకులు అయినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో ప్రియాంక ఇద్దరు యువకులతో కలిసి బయటకు వెళ్లినట్లు తెలిసింది. అనంతరం ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును హిట్ అండ్ రన్‌గా భావిస్తున్న పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ జాహ్నవి, డీవైఎస్పీలతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు హగరిబొమ్మన హళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


