బళ్లారి అర్బన్: అస్సాంలోని గౌహతిలో జరిగిన 24వ అఖిల భారత కరాటే చాంపియన్‌షిప్‌లో కర్ణాటక జట్టు క్రీడాకారులు పతకాల పంట పండించారు. ట్రెడిషనల్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బళ్లారి, విజయనగర జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. యశ్‌రాజ్, సాగర్ కవాసి, ధనిష్ రెడ్డి, బింద్యా, సరస్వతి కులకర్ణి ద్వితీయ స్థానాలు సాధించగా.. అక్షుభ్య రిహాన ఠాకూర్, అన్మోల్ కుమార్, ఆనంద్ కవాసి, రేవంత్ రెడ్డి, సూర్యదర్శిని, నవీన్ తృతీయ స్థానాల్లో నిలిచారు. 15 ఏళ్ల పై బడిన కటా జట్టు విభాగంలో పిసా అనూప్, కోమట్టి వరుణ్ బాబు, సరస్వతి కులకర్ణి బృందం మూడో స్థానం సాధించింది. 35 ఏళ్ల కమిటే, కటా విభాగాల్లో కొండయ్య రెండో స్థానంలో నిలిచాడు. విజేతలను అకాడమీ వ్యవస్థాపకుడు కట్టె స్వామి, టెక్నికల్ డైరెక్టర్ సుభాష్ చంద్ర, జిందాల్ విద్యా మందిర్ ప్రిన్సిపల్, కోచ్‌లు అభినందించారు.


