అలా.. అల
గురువారం మంగళూరులో తన్నీరుబావి బీచ్‌లో అలలపై యువ సర్ఫర్ విన్యాసం. త్వరలో జాతీయ సర్ఫింగ్ పోటీలు జరగనున్నాయి
మైసూరు: మీరు డిపాజిట్ చేసిన బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొనుగోలు చేస్తా. మిగిలిన డబ్బును వెంటనే ఇస్తానని చెప్పి వందలాది మందిని మోసం చేసిన ఆరోపణలపై జైలు పాలైన సౌందర్ రాజ్ అలియాస్ చిన్నతంబికి చెందిన ఎస్డీజే గోల్డ్ కంపెనీపై కేవలం 4 రోజుల్లోనే సీసీబీకి 200కు పైగా ఫిర్యాదులు అందాయి. చిన్నతంబి చేసిన మోసంపై పత్రాలతో ఫిర్యాదులు స్వీకరించాలని మైసూరు నగర పోలీస్ కమిషనర్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా చిన్నతంబి చేసిన మోసాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మైసూరు, మండ్య, బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 200 మందికి పైగా ప్రజలు సరైన పత్రాలతో మైసూరులోని సీసీబీ కార్యాలయాన్ని సంప్రదించి న్యాయం చేయాలని కోరుతున్నారు. అనుబంధ సంస్థలైన డీజీఎఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్, ధన గణపతి ఫైనాన్స్‌పై నమోదైన బహుళ కోట్ల రూపాయల బంగారు మోసం కేసులో బాధితులు సీసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా, దావణగెరె, మైసూరు, హాసన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు చిన్నతంబి మోసాల వలలో చిక్కుకుని రూ.40 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు తేలింది. ఇంకా చాలా మంది రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు నష్టపోయారు. తక్షణం తమకు డబ్బు లేదా బంగారం ఇప్పించాలని మహిళలకు గొడవకు దిగుతున్నారు.
డిపాజిట్ల రక్షణ చట్టం కింద కేసు
కేపీఐడీ (కర్ణాటక డిపాజిటర్ల ఆర్థిక సంస్థల ప్రయోజనాల పరిరక్షణ చట్టం) చిన్నతంబిపై మైసూరు నుంచి బీదర్ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఆర్థిక సంస్థల డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారు.
కేసు దర్యాప్తుకు సమయం
అతనిపై నిరంతరం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తి కావడానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని ఈ కేసు దర్యాప్తు అధికారి, సీసీబీ ఏసీపీ మహమ్మద్ షరీఫ్ రావార్తా తెలిపారు. ఇటీవల బంగారు ఆభరణాల అమ్మకం లేదా తాకట్టుకు సంబంధించి మైసూరు నగర పోలీసుల అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో, అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. మోసపూరిత సంస్థలతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని పౌరులను హెచ్చరించారు.
మైసూరులో ఘరానా మోసం గుట్టురట్టు
వందలాది బాధితులు లబోదిబో
బడా మోసగాడు చిన్నతంబి అరెస్టు
ఇప్పటికే 200 మంది ఫిర్యాదు


