శివాజీనగర: జాతీయ నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం బెంగళూరులో బృహత్ ధర్నా జరిగింది. స్వతంత్ర పార్కులో జరిగిన ధర్నా సభలో సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాతో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ రాజీపడ్డారు అనే పేరుతో టీషర్టును సీఎం విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. నీట్ రద్దుతో 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు, నీట్ అక్రమాలకు కేంద్రానిదే బాధ్యత అన్నారు. నీట్ పరీక్షలో పదే పదే అక్రమాలు జరుగుతున్నాయి. దీనికి బదులు రాష్ట్రాలే పరీక్ష నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గవర్నర్‌కు వినతిపత్రం
ధర్నా తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు చలో లోక్‌భవన్ ర్యాలీ చేపట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆ తరువాత కొందరు నాయకుల బృందం గవర్నర్‌కు వినతి పత్రాన్ని సమర్పించింది.
కాంగ్రెస్ నేతల ధ్వజం
ధర్నాలో పాల్గొన్న సీఎం సిద్దు


