హంపీలో ప్రాచీన విగ్రహాల లభ్యం | - | Sakshi
Sakshi News home page

హంపీలో ప్రాచీన విగ్రహాల లభ్యం

May 22 2026 4:40 AM | Updated on May 22 2026 4:40 AM

హొసపేటె: ప్రసిద్ధ చారిత్రక హంపీలోని హజార రామ ఆలయం సమీపంలో భారతీయ పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. క్రీ.శ 1565లో జరిగిన తాళికోటె యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత శత్రువులు వందలాది ఆలయాలు, శిల్పాలను ధ్వంసం చేసినవి ఈ తవ్వకాల్లో బయట పడుతున్నాయి. ఆలయం ముందు సాగిన తవ్వకాలలో వైష్ణవ ఆళ్వారుల విగ్రహాలు లభించాయి. సుమారు 11 మంది ఆళ్వార్ల విగ్రహాలను యుద్ధం తరువాత పాడు చేసి ఉంటారని అధికారులు చెప్పారు. విగ్రహాలను ధ్వంసం చేసి గుంతలో వేసి మట్టితో కప్పేశారన్నారు. శిరచ్ఛేదం చేసిన రీతిలో ఈ విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వకాలను కొనసాగిస్త్నుట్లు తెలిపారు.

హజారా రామ మందిరం ముందు తవ్వకాలు

Advertisement
 
Advertisement
Advertisement