రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సకాలంలో పత్తి విత్తనాలు అందించాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మరిలింగ పాటిల్ మాట్లాడారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అవకాశం కల్పించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్ ధరకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలన్నారు. గత ఏడాది దేవదుర్గ తాలూకాలో రైతులు వేలాది ఎకరాల్లో నకిలీ పత్తి విత్తనాలు వేసి నష్టాల పాలయ్యారన్నారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరుతూ వ్యవసాయ శాఖ జేడీ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉమాదేవి, మల్లేష్ నాయక్, నాగరాజ్, రమేష్, బసన గౌడ, పరమేష్‌లున్నారు.


