ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నింగప్ప | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నింగప్ప

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

బళ్లారిఅర్బన్‌: కర్ణాటక రాష్ట్ర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం 2026–31వ సంవత్సరాలకు జిల్లా విభాగానికి సి.నింగప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి ఈశయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలో గుండప్ప నాగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పరశురామ చౌకాలి ఉపాధ్యక్షుడిగా, శాంతికుమారి ఎం.బసవనగౌడ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నింగప్ప వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. మిగిలిన ఇద్దరు ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులను తదుపరి కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో నియమిస్తామని నింగప్ప తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement