విద్యుత్‌ షాక్‌తో కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడు మృతి

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకా రాజవాళ గ్రామంలో విద్యుత్‌ షాక్‌కు గురై ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. మృతుడిని నవలికి చెందిన సురేష్‌(31)గా గుర్తించారు. రాజవాళ గ్రామంలో లైన్‌మెన్‌లతో కలిసి వెళ్లి విద్యుత్‌ స్తంభంపై సురేష్‌ మరమ్మతులు చేస్తున్నాడు. ఈ ఘటనలో సురేష్‌ స్తంభం మీదే విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. హిరే హడగలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రాజీవ్‌గాంధీ సేవలు అనన్యం

రాయచూరు రూరల్‌: దేశానికి మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సేవలు అనన్యమని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. అత్యంత ప్రభావశాలి ప్రధానమంత్రిగా ఉండి దేశంలో విజ్ఞాన, సాంకేతిక రంగంలో పురోగతి చెందేలా తీర్చిదిద్దారన్నారు. దేశ భద్రతను పటిష్ట పరిచే ప్రక్రియలో రాజీవ్‌గాంధీ చేసిన ప్రయత్నం మరువలేనిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు చట్ట ప్రకారం రిజర్వేషన్లు, దళితులకు, మైనారిటీ, వెనుకబడిన వర్గాలకు పదవులు లభించే మార్గం దొరికిందన్నారు. కార్యక్రమంలో అమరేగౌడ, రుద్రప్ప, చేతన్‌, ఆంజనేయ, శంశాలం, శివమూర్తి, జయంత్‌రావ్‌లున్నారు.

కుసుమ దిగుబడి ఘనం.. రైతన్న దరహాసం

ఈసారి ఆశించిన మేర పంట దిగుబడి

కొనుగోళ్లకు ఏపీఎంసీ అధికారులు సిద్ధం

రాయచూరు రూరల్‌: ఉత్తర, కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్‌, కలబుర్గి, బాగల్‌కోటె, విజయపుర జిల్లాల్లో రైతులు తమ భూముల్లో సాగు చేసిన కుసుమ పంట ఆశించిన మేర దిగుబడి లభించింది. రాయచూరు జిల్లాలో రైతులు 10 వేల ఎకరాలు, బాగల్‌కోటె జిల్లాలో 25 వేల ఎకరాలు, యాదగిరి జిల్లాలో 5 వేల ఎకరాలు, కలబుర్గి జిల్లాలో 2 వేల ఎకరాల్లో కుసుమ పంటను సాగు చేశారు. పంటను విక్రయించడానికి రైతులు సిద్ధం కాగా ఏపీఎంసీ అధికారులు కొనుగోలుకు ముందుకు వచ్చారు. క్వింటాల్‌ ధర రూ.6,540 పలుకుతోంది. ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి స్థాయిలో జరగడంతో కొనుగోలుకు సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు కొనుగోళ్లకు ముందుకు వచ్చారని రైతు సంఘం అధ్యక్షుడు అందానప్ప పేర్కొన్నారు.

విమానాశ్రయ నిర్మాణం సత్వరం పూర్తి చేయాలి

రాయచూరు రూరల్‌: జిల్లా కేంద్రం చేపడుతున్న విమానాశ్రయం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాధికారిణి పూవిత సూచించారు. బుధవారం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. భూ అభివృద్ధి, రన్‌ వే, మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

కారు, లారీ ఢీ.. ఒకరు మృతి

ముగ్గురికి గాయాలు

సాక్షి,బళ్లారి: కారు, లారీ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన జరిగింది. బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా సంకేశ్వర గోటూరు రోడ్డులో జరిగిన ప్రమాదంలో మహారాష్ట్రలోని పుణెకు చెందిన హనమంతు పాయాళ(55) అనే వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని బెళగావి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సిద్దారూఢ మఠానికి రూ.31.82 లక్షల కానుకలు

హుబ్లీ: ప్రజల ఆరాధ్య దైవం సిద్దారూఢ మఠం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆ మఠం స్ట్రేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖ సిబ్బంది, భక్తుల సమక్షంలో లెక్కించారు. గత 27 రోజుల్లో హుండీల్లో రూ.31,82,905 నగదు, రూ.5,89,518 విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement