వేశ్యావాటికలపై మెరుపు దాడి | - | Sakshi
Sakshi News home page

వేశ్యావాటికలపై మెరుపు దాడి

May 22 2026 12:48 AM | Updated on May 22 2026 12:48 AM

బళ్లారిఅర్బన్‌: నగరంలో వేశ్యావాటికలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అనంతపురం రోడ్డులోని గాంధీనగర్‌, ఏపీఎంసీ, కౌల్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వేర్వేరు చోట్ల దాడులు చేసి విటులను అదుపులోకి తీసుకొని నలుగురు మహిళలను రక్షించి కేసులు నమోదు చేశారు. ఈనెల 17న గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సొంత లింగణ్ణ కాలనీలోని తిరుమల ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఒక ఇంటిపై పోలీసులు సెర్చ్‌ వారెంట్‌తో దాడి చేశారు. ఒక మహిళను రక్షించి ఈ కేసులో దేవి ప్రసాద్‌ను, సూరి అలియాస్‌ జల్లా సూరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 20న అనంతపురం రోడ్డు ఎన్‌బీ ఆస్పత్రి సమీపంలో ఉన్న నీలకంఠేశ్వర నిలయంలో అక్రమ లైంగిక కార్యకలాపాలు జరుగుతున్న సమాచారం మేరకు గాంధీనగర్‌ పోలీసులు మరోసారి దాడి చేసి ఒక మహిళను రక్షించి శ్రీసేవా నికేతన్‌కు అప్పగించారు. ఈ కేసులో నిందితుడు ఎస్‌.షాజబిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీఎంసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అగడి మారెప్ప కాంపౌండ్‌లో రెండో అంతస్తులో కేఎంఎస్‌ శకుంతలమ్మ ఇంటిపై పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళలను రక్షించి ఈ కేసులో గణేష్‌, ఉషాలను అరెస్ట్‌ చేశారు. నిందితురాలు శాంతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. కౌల్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బండిహట్టి సర్కిల్‌ వెంకటేశ్వర్‌ కాంప్లెక్స్‌ వెనుక ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఫిరోజ్‌, అబ్దుల్‌ ఖాదిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం నిందితులు డబ్బు ఆశ చూపించి అద్దె ఇంట్లో వ్యభిచారం చేపట్టడంతో జిల్లా ఎస్పీ డాక్టర్‌ సుమన్‌ డి.పన్నేకర్‌ ఆదేశాల మేరకు ఆయా స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు సిబ్బందితో వెళ్లి అరెస్ట్‌ చేశారు.

నలుగురు మహిళల రక్షణ

పలువురు విటుల అరెస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement