హొసపేటె: వాణిజ్యం, సాంకేతికత అనేవి అభివృద్ధికి రెండు కళ్లులాంటివని బళ్లారి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మునిరాజు తెలిపారు. బుధవారం ప్రౌఢదేవరాయ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. వాటిలో ఏ ఒక్కటి దెబ్బ తిన్నా దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. ఈ విషయంలో సాంకేతికత, వ్యాపారం సమాంతరంగా దృష్టి సారిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి కోసం విద్యార్థులు కష్టపడాలని అన్నారు. ఈ ప్రాంతం వెనుకబడినందున ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేవన్నారు. విద్యార్థులు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌లను ప్రారంభించి తమ సొంత కాళ్లపై నిలబడాలన్నారు. కాలేజీ పాలక మండలి అధ్యక్షుడు కల్గుడి మంజునాథ్, సభ్యులు సంగనబసవ, అనిల్, జవళి, ప్రిన్సిపాల్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.మునిరాజు


