రాయచూరు రూరల్: జిల్లాలో జూన్ 28 నుంచి పల్స్ పోలియోకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో 26,00,002 చుక్కలు వేశారన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1132 కేంద్రాలు, 53 ట్రాన్సిట్ బూత్‌లు, 33 మొబైల్ జట్లు, 248 మంది సూపర్‌వైజర్లను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఆరోగ్య శాఖాధికారులు సురేంద్ర బాబు, నంది, గణేష్, చంద్రశేఖరయ్యలున్నారు.


