వ్యవసాయ సహకార సంఘానికి ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ సహకార సంఘానికి ఎన్నిక

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

బళ్లారి అర్బన్‌: నగరంలోని ఎస్పీ సర్కిల్‌ సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ఎన్నికల్లో కే.ఫకీరప్ప అధ్యక్షుడిగా గెలుపొందారని ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి హెచ్‌.అమీనా బేగం తెలిపారు. మంగళవారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో కే.ఫకీరప్ప, కే.శ్రీకళ అధ్యక్ష స్థానాలకు పోటీ పడ్డారు. ఎన్నికల్లో 13 మంది డైరెక్టర్లు తమ ఓటు హక్కు ద్వారా ఫక్కీరప్పకు 7 ఓట్లు, శ్రీకళకు 6 ఓట్లు వేయగా, ఫకీరప్ప ఒక ఓటు తేడాతో విజయం సాధించారు. సంఘానికి డైరెక్టర్ల ఎన్నికలు 2024 డిసెంబర్‌లో జరగగా 2025 జనవరిలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. బీ.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షుడుగా, వి.శిల్ప ఉపాధ్యక్షురాలుగా ఎంపికయ్యారు. అయితే వీరి అధికారావధి ముగియడంతో గత నెల 19న శ్రీనివాస్‌ రెడ్డి రాజీనామా చేసినట్లు అధికారిణి తెలిపారు. నెలరోజుల పాటు ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్చలు జరగగా, చివరకు ఎన్నికల ద్వారా అధ్యక్ష స్థానం భర్తీ చేశారు. బీడీసీసీ బ్యాంకు ప్రతినిధి జే.రవీంద్రకుమార్‌, డైరెక్టర్లు, ప్రముఖులు మాజీ కార్పొరేటర్‌ కెరెకోడప్ప, కే.పరమేష్‌, పోస్టల్‌ వెంకటేష్‌, నరేష్‌, పంపాపతి, కృష్ణ, మాజీ ఉప మేయర్‌ భర్త వడ్డే రాముడు తదితరులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement