యశవంతపుర: పశ్చిమాసియా యుద్ధం వల్ల మనదేశంలో పెట్రోలు, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఇలాంటి సమయంలో రేవు నగరం మంగళూరులో కావూరు వద్ద బల్లపగురి రోడ్డులోని మూడు ఇళ్లలోని మూడు బావుల్లో డీజిల్ ఉప్పొంగుతోంది. దీంతో జనం సంభ్రమానికి లోనయ్యారు. బావుల నీటిలో 28 శాతం శుద్ధమైన డీజిల్ ఉందని ల్యాబ్ పరీక్షల్లోనూ బయటపడింది. బావిలోని నీటిని అనేకసార్లు తోడినా మళ్లీ అదే మాదిరిలో ఆయిల్‌తో కూడిన నీరు ఊరుతోంది. చమురు ఉత్పత్తి వల్ల ఇబ్బందిగా ఉందని, తాగడానికి, పాత్రలు కడగడానికి కుదరడం లేదని మహిళలు వాపోయారు. సమీపంలోని డీజిల్ బంకు నుంచి లీకై బావుల్లోకి చేరుతోందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ బంకుల్లో డీజిల్ నిక్షేపంగా ఉందని యజమానులు చెప్పారు. మంగళూరులో భారీ పెట్రోలియం రిఫైనరీ ఉండడం తెలిసిందే. దాని ప్రభావమా? అనే సందేహాలున్నాయి. పరిశీలన చేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
మంగళూరులో వింత


