శివమొగ్గ: భద్రావతి తాలూకాలోని కల్లహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సిరియూర్ గ్రామంలోని రవికుమార్ ఫారంలో గొర్రెల మందలో సుమారు 52 గొర్రెలు మరణించాయి. చిత్రదుర్గ జిల్లా, హిరియూరుకు చెందిన నరసింహ మూర్తి 400 గొర్రెల మందను రవికుమార్ ఫారంలో వదిలిపెట్టారు. సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములతో కూడిన వర్షం కురిసి పిడుగులు పడడంతో ఆ ధాటికి 52 గొర్రెలు చనిపోయాయి. శివమొగ్గ పశుసంవర్ధక సిబ్బంది వినయ్, వైద్య అధికారి మధుసూదన్, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.


