● పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు
బళ్లారి రూరల్ : నిన్నటివరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన బళ్లారి నగరం మంగళవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, గాలివానతో దద్దరిల్లింది. విపరీతమైన గాలికి తోడు జోరువాన కురిసింది. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో గాలికి చెట్లు నేలకొరిగాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కరెంట్ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని మొదటి గేటు, రెండో గేటు, సుధాక్రాస్, హొసపేటె రోడ్డు, బీఎంసీఆర్‌సీ ఆసుపత్రి ప్రాంగణం, విద్యానగర్ 5వ క్రాస్ ప్రాంగణంలో పలు చెట్లు కూలాయి.


