పలకరించిన తొలకరి | - | Sakshi
Sakshi News home page

పలకరించిన తొలకరి

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

బళ్లారిఅర్బన్‌: గణినాడుగా పేరు గాంచిన బళ్లారిలో సుమారు 45 డిగ్రీల వరకు ఎండలు మండుతున్నప్పటికీ గత రెండు నెలలుగా అల్లాడి పోతున్న ప్రజలకు మంగళవారం తొలిసారి కురిసిన భారీ వర్ష ప్రభావంతో వాతావరణం చల్లబడి ఊరటను కల్గించింది. ఈ వర్షంలో వడగళ్లు కూడా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కురిసిన గాలి, వాన, ఉరుములు, మెరుపుల ప్రభావంతో కురిసిన వర్షంతో చెట్లు విరిగి కరెంట్‌ తీగలపై పడి రోడ్లపైకి నేలకొరిగి రాకపోకలు స్తంభించాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. ఈ భారీ వర్ష ప్రభావంతో కనక దుర్గమ్మ గుడి సమీపంలోని అండర్‌ బ్రిడ్జి, సత్యనారాయణ పేట అండర్‌ బ్రిడ్జి, రంగమందిరం రైల్వే బ్రిడ్జిల కింద మోకాలి లోతున నీరు నిలబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏదేమైనా ఈ వర్ష ప్రభావంతో బళ్లారిలో వాతావరణ చల్లబడి రోడ్లపై కాస్త నీరు నిలబడటంతో మంటుడెండల నుంచి ఉపశమనం కలిగింది.

బళ్లారిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

వేసవి మండుటెండల నుంచి

ప్రజలకు ఊరట

Advertisement
 
Advertisement
Advertisement