రాయచూరు రూరల్: నగరంలో రాజ కాలువల స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించి పరిసరాలను సంరక్షించాలని స్వచ్ఛత నోడల్ అధికారి కృష్ణ శావంతగేర పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని భంగికుంట, కోట బస్టాండ్ వంటి ప్రాంతాల్లో మురుగు కాలువల్లో పూడి పోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నగరసభ అధికారులు, సిబ్బంది నిఘా ఉంచి స్వచ్ఛత కాపాడలేని వారిపై జరిమానా విధించాలన్నారు. వర్షాకాలంలో వర్షపు నీరు పైకి రాకుండా కాలువల్లో ప్రవహించే విధంగా చూడాలని కోరారు.


