అల్యూమినియం వైర్‌ దొంగలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అల్యూమినియం వైర్‌ దొంగలు అరెస్ట్‌

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరులో విండ్‌ ఫ్యాన్‌ విద్యుత్‌ స్తంభం నుంచి అల్యూమినియం వైర్‌ దొంగిలించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఏప్రిల్‌ 7, 2026న కొట్టూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విండ్‌ ఫ్యాన్‌ విద్యుత్‌ స్తంభం నుంచి ఒక అల్యూమినియం తీగ దొంగిలించబడింది. ఈ విషయమై కొట్టూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల కూడ్లిగి ఉజ్జిని రహదారిపై గంగమ్మన హళ్లి క్రాస్‌ సమీపంలో నిర్వహించిన ఆపరేషన్‌లో సండూర్‌ తాలూకాలోని హిరేకెరేయగినహళ్లి గ్రామానికి చెందిన ఏ.మల్లికా రేణాన, జోగజ్జర్‌ అంజినప్ప, గుడ్లుమార్‌పూర్‌ బసవరాజ్‌, జోగజ్జర్‌ దురుగప్పను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి నుంచి నేరంలో ఉపయోగించిన రూ.4 లక్షల విలువైన అల్యూమినియం వైర్‌, రూ.3 లక్షల విలువైన టాటా ఏసీ గూడ్స్‌ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొట్టూరు పోలీస్‌ స్టేషన్‌ పీఏఎస్‌ గీతాంజలి షిండే, సిబ్బంది యు.నాగప్ప హెచ్‌.బసవరాజ్‌, శశిధర్‌, టెక్నికల్‌ విభాగంలోని బసవకుమార్‌, శశిధర్‌, టెక్నికల్‌ పత్రీకుమార్‌, విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించినందుకు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఎస్‌ జాహ్నవి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement