తాలూకా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తాలూకా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

హొసపేటె: మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా వ్యామోహాన్ని వదిలించుకుని.. క్రీడలపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌ యువజన నాయకుడు అశోక్‌ భీమనాయక యువతకు పిలుపునిచ్చారు. తంబ్రహళ్లిలో తాలూకా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువతరం ఆందోళనకర స్థాయిలో మొబైల్‌ ఫోన్లకు బానిసలు అవుతున్నారని తెలిపారు. సామాజిక అభివృద్ధికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక బాధ్యత అవసరమని అభిప్రాయపడ్డారు. క్రీడలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. అవి క్రమశిక్షణ నాయకత్వం, ఇది సహనాన్ని, జట్టు స్ఫూర్తిని పెంపొందించేందుకు ఉపయోగపడుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువతకు తగిన వేదికను కల్పిస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వివిధ రకాల చెట్లను నాటడం ద్వారా పర్యావరణ అనుకూల సందేశం వ్యాప్తి చేయబడిందన్నారు. విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోరి గోనిబసప్ప, హామీ పథకం అమలు కమిటీ అధ్యక్షుడు గురుబసవన రాజ్‌, గౌరజ్జనవర గిరీష్‌, సురేష్‌, డిష్‌ బాలప్ప, బాదర్డికి నాగరాజ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement